తెల్ల గుమ్మడి అంటే ఎక్కువగా ఇంటి ముందు దిష్టికి వాడుతూ ఉంటారు. అయితే ఈ గుమ్మడి లో ఎన్నో పోషకాలు ఉన్నాయో చాలామందికి తెలియదు.. అయితే దీనిలో ఉపయోగాలు అధిక బరువు దగ్గర్నుంచి అస్తమ వరకు ఎన్నో రకాల ఉపయోగాలు అందిస్తుంది. గుమ్మడికాయ అనగానే మనం కామన్ గా దాని గురించి పెద్దగా పట్టించుకోము. బూడిద గుమ్మడిని దిష్టికి వాడుతారు. కావున ఆటోమేటిక్గా పంపికిన్ అనగానే మనలో నెగటివ్ ఒపీనియన్ వచ్చేసింది.
ఈ స్టోరీ ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి.ఈ గుమ్మడికాయలు చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. అయితే వీటిని బొల్లి గుమ్మడికాయలు అని కూడా పిలుస్తారు. వాస్తవానికి వీటిలో పసుపు, ఆరెంజ్, బ్రౌన్ 4 ఇలా చాలా రకాలు ఉంటాయి .ఇంగ్లండ్ లో తెల్ల గుమ్మడిని డెకరేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. హోలోవిన్ పండగ టైంలో ఈ గుమ్మడికాయల్ని బాగా అలంకరణకు వాడుతూ ఉంటారు. అధిక బరువు పెరగడానికి గుండె జబ్బులు రావడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాలను తెల్ల గుమ్మడికాయలు బాగా తగ్గిస్తాయి. వీటిలో ఫైట్ స్టెరాల్స్ ఉంటాయి. హైబీపీ ఉన్నవాళ్లు అధిక బరువు ఉన్నవాళ్లు తెల్ల గుమ్మడికాయను వండుకొని తినడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది.