కేటాయింపులు ఇలా..
– రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు
– మూలధన వ్యయం రూ.35,525 కోట్లు
– పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల సాయం
– ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
– కొత్తగా మరో 100 బస్తీ దవాఖానాల ఏర్పాటు
– ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు
– విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
– బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగుల భృతి హామీ
– ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
– ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ
– మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
– ప్రభుత్వ ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు
– మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం రూ.1,500 కోట్లు
– పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు
– డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.12వేల కోట్లు
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లుగా ఉందని, పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా ఉందన్నారు. తలసరి ఆదాయం రూ.3,17,155గా అంచానా వేస్తున్నారు. తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆగలేదని, అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుకూలంగా సమగ్రాభివ ృద్ధి చేశామన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జీఎస్‌డీపీ క్రమేణా పెరుగుతూ వచ్చిందన్నారు. తెలంగాణ అభివ ృద్ధి మోడల్ గురించి ఊరూవాడ చర్చ జరుగుతోందన్నారు. 2019-20 సంవత్సరానిని జీఎస్‌డీపీి వృద్ధి రేటు 13.2 శాతానికి పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా తలసరి ఆదాయం 11.8 శాతం వ ృద్ధిరేటును నమోదు చేసిందని హరీష్ రావు ప్రశంసించారు. దేశ జిడిపిలో తెలంగాణ జిడిపి శాతం 4.9 కావడం గర్వకారణమని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రధాన రంగాల్లో అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు కనిపించిందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మెరుగైన వృద్ధి రేటు కనిపించిందని వివరించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఈ వృద్ధి రేటు సాధ్యమైందని, జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 86 శాతం ఎక్కువగా ఉందని ఆయన తెలియజేశారు.