ఆత్మకు శాంతి కలగాలి: ప్రధాని మోదీ
హైదరాబాద్: నందమూరి తారకరత్న మృతిపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న మృతి చెందారన్న వార్త తనను ఎంతో కలచివేసిందన్నారు. చిన్న వయసులోనే అతడు మరణించడం బాధాకరమని మోదీ అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబసభ్యులు, తెలుగు ప్రజలకు తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోదీ కోరుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.