చిరు ఎమోషనల్ పోస్టు
తనయుడు రామ్‌చరణ్ నటన గురించి పలువురు మెచ్చుకుంటుంటే చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా తన నటనేంటో చూపించిన చర్రీ.. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామరాజుగా అదరగొట్టారు. ఈ సినిమాపై ప్రముఖ హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ జక్కన్నపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో భావోద్వేగంతో చిరు ట్వీట్ చేశారు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ ఆర్‌ఆర్‌ఆర్ రామ్‌చరణ్ పాత్రను మెచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ అద్భుత సినిమా. ఒంటరిగా ఆ సినిమా చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. కథ చెప్పిన విధానం, వీఎఫ్‌ఎక్స్ అంతా కూడా షేక్‌స్పియర్ క్లాసిక్‌లా అనిపించింది. రామ్ క్యారెక్టర్ నిజంగా ఛాలెంజింగ్ పాత్ర.
ఇటీవలే రాజమౌళిని కలిసినప్పుడు ఇదే చెప్పానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది చూసి చిరంజీవి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆ వీడియో షేర్ చేస్తూ.. జేమ్స్ కామెరూన్ చరణ్ పాత్రను ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ జేమ్స్, చరణ్ పర్ఫామెన్స్‌ను ఇష్టపడ్డారంటే.. ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదే అవుతుంది. చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా? తండ్రిగా తనను చూసి గర్వపడుతున్నా. జేమ్స్ కామెరూన్ ప్రశంసలే చరణ్‌కి దివ్వ ఆశీస్సులు… తన భవిష్యత్తుకు బంగారు బాటలని భావోద్వేగంతో చిరు ట్వీట్ చేశారు.