నటుడు నందమూరి తారక రత్న పార్థివ దేహాన్ని చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కల్యాణ్ రామ్ లు ఫిల్మ్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. తమ సోదరుడిని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వీరే కాకుండా అనేక మంది ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుంటున్నారు. కడసారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు అభిమానుల సందర్శనార్థం తారకరత్న మృతదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచగా.. వేలాది మంది అభిమానులు వస్తున్నారు. అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే భర్త మరణాన్ని ఆయన భార్య అలేఖ్య రెడ్డి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదిస్తూనే ఉంది. తన కూతురిని పట్టుకొని కంటికి ధరగా విలపించగా.. ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించారు. అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనైందని ఆమె తండ్రి వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి చెప్పారు.