హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న నూతన చివాలయం ప్రారంభాల్సి ఉంది. ఈ అంశంపై సీఈసీతో సీఎస్ సంప్రదింపులు జరిపారు. కానీ సీఈసీ నుంచి ఆశాజనకమైన స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం విదితమే.