విదేశాల్లో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది. భారతీయ విద్యార్థుల్లో చాలా మంది ఇందుకోసం బ్యాంకుల నుంచి విద్యారుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే, స్టుడెంట్ లోన్ కూడా చాలా మంది పేరెంట్స్ కు ఆర్థికంగా భారమే. Scholarships in Canada Universities: కెనడా లో స్కాలర్ షిప్స్ ఈ నేపథ్యంలో విద్యార్థులు చూసే మరో ఆప్షన్ ఫండింగ్ లేదా స్కాలర్ షిప్. కెనడాలోని పలు విద్యాసంస్థలు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఆ విద్యా సంస్థల వివరాలను ఆక్స్ ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ గా పని చేస్తున్న ఒల్యుసీన్ క్వెసీ అజాయి తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇవే.. Scholarships in Canada Universities: స్కాలర్ షిప్ ల వివరాలు సెంటెన్నియల్ కాలేజ్(Centennial College): ఈ కాలేజీ కోర్సును బట్టి పలు విభాగాల్లో స్కాలర్ షిప్స్ ను ఆఫర్ చేస్తోంది. హంబర్ కాలేజీ (Humber College): అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్ షిప్స్ ను ఈ కాలేజీ అందిస్తోంది.
కమ్యూనిటీ ఇన్వాల్వ్ మెంట్, లీడర్ షిప్, వాలంటరీ సర్వీస్ లను కూడా గుర్తించి స్కాలర్ షిప్ లను ఆఫర్ చేస్తుంది. సెనెకా కాలేజీ (Seneca College): విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ కాలేజీ పలు రకాల స్కాలర్ షిప్ లను, బర్సరీలలను, ఇతర అవార్డులను ఇస్తుంటుంది. కాలేజీ నిర్ధారించిన ప్రమాణాలు, అర్హతలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంటుంది. ఫాన్శావీ కాలేజీ (Fanshawe College): ఈ విద్యాసంస్థ 650 కి పైగా స్కాలర్ షిప్ లను ఇస్తోంది. జార్జి బ్రౌన్ కాలేజీ (George Brown College): విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ లను ఈ కాలేజీ అందిస్తోంది. మంచి ఎకడమిక్ రికార్డు ఉన్నవారికి ఈ సాయం అందజేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ (University of Waterloo): ఇక్కడ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ చాలా ఫేమస్. దీని ద్వారా ప్రతీ టర్మ్ కు 2,500 డాలర్ల చొప్పున ఐదు ఫుల్ టైమ్ టర్మ్ ల వరకు ఫైనాన్షియల్ ఎయిడ్ లభిస్తుంది. సాధారణంగా రీసెర్చ్ కు సంబంధించిన ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయ్యేవారికి ఇది లభిస్తుంది.