హైదరాబాద్ గరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో టూరిస్టులకు బోలెడంత వినోదం.. ఇక్కడ అనేక సౌకర్యాలు ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రయాణికుల వినోద విహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోర్ట్ యాజమాన్యం అంతకంతకు సౌకర్యాలను పెంచుతోంది. అందులో భాగంగా డ్రైవ్ – ఇన్ థియేటర్. అంటే ఒక లార్జ్ స్క్రీన్ పై సినిమాలను ఇక్కడ కార్ లోంచే వీక్షించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇది దేశంలో మొదటి ఎయిర్ పోర్ట్ డ్రైవ్-ఇన్ థియేటర్ గా పాపులర్ కానుంది. ఆక్వా గోల్ఫ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు కానుంది. డ్రైవ్-ఇన్ థియేటర్ ప్యాసింజర్ టెర్మినల్ భవంతి ముందు భాగంలో పెద్ద స్క్రీన్ ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చాలా కార్ల పార్కింగుకి వసతి ఉండడంతో ఇక సినిమా వినోదం మరింత సులభతరంగా మారనుంది. చాలా సమయాన్ని ప్రయాణీకులు వృథా చేసుకోనవసరం లేదు. ఇక్కడ తమ సమయాన్ని ఆస్వాధన కోసం ఉపయోగించుకునే వీలుంటుంది.