రేపు సాగర్ ఒడ్డున ఫార్మలా ఈ రేసింగ్
హైదరాబాద్: ఆటోమొబైల్ దిగ్గజం, మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను మెగా వపర్ స్టార్ రామ్‌చరణ్ కలిశారు. ఇండియాలో మొదటిసారి జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. శనివారం హుస్సేన్ సాగర్ ఒడ్డున ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభమవుతుంది. ఈ రేసులో మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఈ-ప్రి రేసింగ్‌లో పాల్గొంటున్న మహీంద్రా గ్రూప్‌కు రామ్‌చరణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ కాసేపు ముచ్చటించారు. వీరితో పాటు మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ ఫొటోలను రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆనంద్ మహీంద్రాను, సీపీ గుర్నానీని కలుసుకోవడం అద్భుతంగా ఉందని రామ్‌చరణ్ పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేసింగ్‌లో విజయం సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన నగరానికి ఇలాంటి కార్యక్రమాలను తీసుకురావడానికి ఎంతో చొరవ చూపిస్తోన్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.