టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా చేపడుతున్న పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాదయాత్ర సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్లోకి వెళ్లిన ఆయన.. అక్కడ గరిటె తిప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేవంత్‌తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. రేవంత్ తన పాదయాత్రలో ప్రజలను ఆకట్టుకునేలా అనేక పనులు చేస్తోన్నారు. ఇటీవల పోలంలోకి వెళ్లి ట్రాక్టర్ నడిపారు.