AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఏకగ్రీవం..!

మొత్తానికి ఒక్కటైన ఎంఐఎం, బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకు దక్కినట్లే..! ఈ స్థానానికి చివరి రోజు వరకు ఒకే ఒక్క నామినేషన్‌ రావడంతో పతంగికే ఈ స్థానం దక్కనుంది. గతంలో ఏంఐఎం బీఆర్‌ఎస్‌ మధ్య విభేదాలు వచ్చాయని ఈ స్థానంలో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ తరుపున ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఎంఐఎంకే ఈ స్థానం దక్కే అవకాశాలున్నాయి.

ఎంఐఎం తరుపున మీర్జా రెహమత్‌ బేగ్‌ నామినేషన్‌ వేశారు. డమ్మీ అభ్యర్థిగా మహ్మద్‌ రహీంఖాన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ దానం నాగేందర్‌ తదితరులు వచ్చారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎంఐఎం ఒక్కటేనని తేలిపోయింది. 13న ఎన్నికల పోలింగ్‌ 16న కౌంటింగ్‌ ఉండే విధంగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. కానీ ఈనెల 27న నామినేషన్‌ ఉప సంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవ ప్రకటన చేయనున్నారు.

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 118 ఓట్లు ఉన్నాయి. వీటిలో ఎంఐఎం కార్పొరేటర్లు 42 మంది ఉండగా.. ఎమ్మెల్యేలు 7గురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఒకరు ఎంపీ ఎక్స్‌ అఫిషియో సభ్యులు 35 మంది ఉన్నారు.

ఇక బీఆర్‌ఎస్‌ కు చెందిన కార్పొరేటర్లు 18 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు 10 రాజ్యసభ సభ్యులు 5 మంది ఉన్నారు. వీరితో పాటు ఈ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లు 23 ఎమ్మెల్యే 1 ఒకరు ఎంపీ ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ 41 మంది ఎంఐఎం 52 కలిపి మొత్తం 93 మంది ఉన్నారు. వీరిలో ఇటీవల బీఆర్‌ఎస్‌ కు చెందిన ఎమ్మెల్యే సాయన్న మతి చెందగా మొత్తం 92కు చేరింది. బీజేపీ నుంచి జూబ్లిహిల్స్‌ అడిక్‌ మెట్‌ కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ లో చేరడంతో 94కు చేరింది. అటు బీజేపీకి ఎంపీ కిషన్‌ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లతో పాటు 25 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు బీఆర్‌ఎస్‌ లోకి చేరడంతో 23 మంది మాత్రమే ఉన్నారు. దీంతో బీజేపీకి పోటీకి దూరంగా ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10