AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్కైవేకు కేంద్రం సహకరించడంలేదు

హైదరాబాద్‌: ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలని అనుకున్నామని, కేంద్రప్రభుత్వం సహకరించకపోవడం వల్లే నిర్మించలేకపోతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీిఆర్‌ శాసన సభలో మాట్లాడారు. కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నామని, అయినా కలిసి రావడంలేదని మంత్రి మండిపడ్డారు. డిఫెన్స్‌ భూముల కావడంతో తాము ముందడుగు వేయలేకపోతున్నామని కేటీఆర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ను నివారించేందుకు వేగంగా రహదారులు పనులు చేపట్టామని మంత్రి చెప్పారు.

రోడ్లపై ఉన్న మతపరమైన నిర్మాణాలు చట్టం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎస్‌ఆర్‌డీపీి కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశామని, మొదటి దశలో మిగిలిన 11 ప్రాజెక్టుల్ని ఈ ఏడాది పూర్తి చేస్తామని, రెండో దశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడతున్నామన్నారు. త్వరలోనే రెండో దశ పనులకు అనుమతిలిచ్చి ముందుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఇప్పటివరకు 47 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని, ప్రభుత్వ చర్యలతో గనుల రాబడిలో గణనీయమైన పెరుగుదల సాధించమన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10