AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.2 వేలు తగ్గిన బంగారం ధర

బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో భారీగా తగ్గుతున్నాయి. నిజానికి బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది గుడ్‌ న్యూసే. ఇప్పటికే బంగారం ధర ఈ నెలలో దాదాపు రూ.2 వేలకు దిగి వచ్చింది. ఇక మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి బంగారం కొనాలనుకుంటున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడమే బెటర్‌. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,180 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.67,500 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,180

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,180

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,180

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,840

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,180

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10