తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కొంతమంది తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. అది అలా ఉంటే ధనుష్ తాజాగా తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి అడుగుపెట్టారు. రూ.150 కోట్లతో నిర్మించారని ప్రచారం. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.