AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోడీ పద్మవ్యూహం… ఏమీ చేయలేక కేసీఆర్ మౌనం

రాజకీయాల్లో కేసీఆర్ ను గండరగండడు అని అందరూ అంటారు.. లేచినా, కూర్చున్నా, పడుకున్నా రాజకీయాల గురించే ఆలోచిస్తాడు.. ఆలోచిస్తూ ఉంటాడు.. అలాంటి కెసిఆర్ ఏకంగా కేంద్రాన్నే ఢీకొడుతున్నాడు.. గతంలో కేంద్రంతో టర్మ్స్ బాగున్నప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తాడు. అది వేరే ముచ్చట. మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏకంగా అమిత్ షా, బి ఎల్ సంతోష్ కు స్కెచ్ వేశాడు.. అది ఆదిలోనే బెడిసి కొట్టింది. అప్పట్లో ప్రెస్ మీట్ లో నేను గోకుతా.. అని కామెంట్లు కూడా చేశాడు.. ఈలోపు ఆ గోకుడును పక్కనపెట్టి దేశ రాజకీయాల మీద పడ్డాడు.. కెసిఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన మోడీ ఇప్పుడు తిరిగి గోకుడు షురూ చేశాడు. ఆమధ్య శంషాబాద్ లోని ముచ్చింతల్ గ్రామంలో సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు మోడీ వచ్చాడు.. దీనిపై కేసీఆర్ చిన్న జీయర్ స్వామి పై అలక బునాడు. అంతేకాదు ప్రతిదానికి ఆయన కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసే కేసిఆర్… దూరం పెట్టాడు. అప్పటినుంచి మాటల్లేవ్.. మాట్లాడు కోవడాలు లేవ్. ఇక ఇదే సమయంలో మొన్న గణతంత్ర దినోత్సవం నాడు కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల పురస్కారంలో చిన జీయర్ స్వామికి చోటు దక్కింది.

అనర్హుడు అనలేము గాని.. రామానుజ విగ్రహావిష్కరణకు మోడీని పిలవడం, కెసిఆర్ అభ్యంతరాలను పట్టించుకోకపోవడం, కొన్నాళ్లుగా కేసీఆర్ క్యాంపుకు దూరంగా ఉండటం, కెసిఆర్ ఆయనను అసలు సహించకపోవడం, యాదాద్రికి కూడా దూరంగా ఉంచడం నేపథ్యంలో జీయర్ కు పద్మభూషణ్ ఇవ్వడం మోడీ మార్క్ రాజకీయాలకు చిన్న ఉదాహరణ. ఇది కెసిఆర్ ను సుతి మెత్తగా గోకడం అన్నమాట. కెసిఆర్ ఏమీ అనలేడు.. కడుపులో ఉక్రోషం మాత్రం గ్యారెంటీ. జీయర్ పుట్టుకతో ఆంధ్రుడైనా, తన కార్యస్థలి తెలంగాణ. ఇక ఇదే సమయంలో మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు కూడా ప్రగతి భవన్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆయన బిజెపి ఫోల్డ్ లో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ అవసరం కాబట్టి పద్మ పురస్కార జాబితాలో ఉంటాడని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ మెఘా కంపెనీ వాళ్లు కూడా బిజెపి ఫోల్డ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అఫ్కోర్స్ కాంట్రాక్టర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ వాలిపోతారు. కాంట్రాక్టుల కోసం వీర విధేయతను నటిస్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10