గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి శ్రీలీలా
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని నటి శ్రీలీలా అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పటాలిటీలో నటి శ్రీలీలా మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీలీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహాత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీలా తెలిపారు.
లో భాగంగా ఇప్పట వరకు 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీలా తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి శ్రీలీలా కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీలా పిలుపు ఇచ్చారు.