AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు

సోదాలు కాదు.. సర్వేనేనన్న అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబయిలోని బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) కార్యాలయాలపై మంగళవారం ఆదాయం పన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించింది. ఉదయం బీబీసీ కార్యాలయాలపై హఠాత్తుగా దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడి ఉద్యోగుల నుంచి వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని బయటకు పంపించివేశారు. ఇదిలా ఉంటే.. ఇది కేవలం సర్వే అని, సోదాలు కాదని ఐటీ అధికారులు వెల్లడిరచారు. పన్నుల అవకతవకలపై ఈ సర్వే నిర్వహించినట్లు వారు చెప్పారు. ఉద్యోగులు కంప్యూటర్లు వాదవద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు లభిస్తే.. ఈ సర్వేను కాస్తా సోదాలుగా మార్చే అవకాశం ఉంటుందన్నారు.

నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం చేసిన తర్వాత ఆ సంస్థ కార్యాలయంపై ఐటీి దాడులు నిర్వహించడం గమనార్హం.
అప్పటి అల్లర్లలో వేలాదిమంది మరణించగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో అత్యధికులు ముస్లింలే. కాగా.. ఈ అలర్లకు నరేంద్ర మోదీ నేరుగా బాధ్యుడని బీబీసీ తన డాక్యుమెంటరీలో ఆరోపించింది. రాజకీయ దురుద్దేశంతో సృష్టించిన ఈ హింసాకాండ అసలు ఉద్దేశం హిందువుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ముస్లింలను తరిమివేయడమేనని బీబీసీ ఆరోపించింది. అప్పటి మోదీ ప్రభుత్వం సృష్టించిన సానుకూల పరిస్థితుల వల్లే అల్లర్లు సాధ్యమయ్యాయని కూడా బీబీసీ ఆరోపించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10