సంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ సొంత పార్టీ కార్యకర్తపై బూతుపురాణంతో విరుచుకుపడ్డారు. వెంకటరమణ అనే బీజేపీ కార్యకర్త బాబుమోహన్‌కు ఫోన్ చేస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం గమనార్హం. ‘‘నువ్వెంత, నీ బతుకెంత..నువ్వు గల్లి లీడర్..నేను రాష్ట్ర నాయకుడిని..మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం. అవసరమైతే బీజేపీకి రాజీనామా చేస్తా’’ అంటూ కార్యకర్త వెంకటరమణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుమోహన్ మాట్లాడిన బూత్ పురాణం ఆడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.