తన భార్య.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోగా.. అతడి భార్యను బాధితుడు పెళ్లి చేసుకుని రివేంజ్ తీర్చుకున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన బిహార్‌లోని ఖగారియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛౌథామ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముఖేశ్.. నీరజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి పారిపోయాడు. దీంతో ముఖేశ్ భార్యతో పరిచయం పెంచుకుని ఆమెను నీరజ్ వివాహం చేసుకున్నాడు. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యకు, నీరజ్‌కు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. ముఖేశ్, నీరజ్ భార్యల పేర్లూ రూబీయే కావడం గమనార్హం.
నీరజ్ భార్య రూబీకి ముఖేశ్‌తో ముందు నుంచే పరిచయం ఉంది. పెళ్లికి ముందు ఇద్దరూ ప్రేమలో ఉండగా.. పెద్దలు నీరజ్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయినా, రూబీ మాత్రం ముఖేశ్‌ను మరిచిపోలేకపోయింది. పెళ్లి తర్వాత సంబంధం కొనసాగించింది. ముఖేశ్కూ వేరే మహిళతో వివాహం జరిగింది. కానీ, గతేడాది ఫిబ్రవరిలో తన ప్రియురాలు రూబీని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం ముఖేశ్, రూబీ తన ముగ్గురు పిల్లలను తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు. తన భార్యను తీసుకుని వెళ్లిపోవడంతో ముఖేశ్‌పై పస్రాహా నీరజ్ కేసు పెట్టాడు.
కొద్ది రోజుల తర్వాత పెద్దలు పంచాయితీకి ఈ విషయం చేరింది. అయితే, ప్రియురాలిని వదలిపెట్టేడానికి ముఖేశ్ ససేమిరా అన్నాడు. ఆమెతో కలిసి ఉంటానని తెగేసిచెప్పాడు. దీంతో ముఖేశ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నీరజ్.. ఆ దిశగా పావులు కదిపాడు. ఈ క్రమంలో ముఖేశ్ మొదటి భార్య (ప్రియురాలు కాదు) రూబీతో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. ఆమె కూడా నీరజ్‌ను అభిమానించడంతో ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు. ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, ముఖేశ్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు.