హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పటికే 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా పులి మేక వెబ్ సిరీస్‌లో పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు తెలుగులోనూ ఆమె మాట్లాడింది. ఈ నేపథ్యంలో కొందరు ఆమెను రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అని తెలివిగా ప్రశ్నించారు. అందుకు కారణం.. ఆమె హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్ షిప్‌లో ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే లావణ్ త్రిపాఠి చాలా తెలివిగా రియాక్ట్ అయ్యింది. అమ్మా నాన్న కూడా రిలేషన్ షిప్ కాదా? అని సమాధానం ఇచ్చింది. అలాగే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగిన ప్రశ్నకు కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్‌ను పెళ్లి గురించి ఎందుకు ప్రశ్నిస్తారు? పెళ్లి గురించి ప్రశ్నించకండి అంటూ సమాధానం చెప్పింది. బెస్ట్ ఫ్రెండ్స్ గురించి అడిగిన క్వశ్చన్ కి నిహారిక, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అంటూ సమాధానం చెప్పింది లావణ్య త్రిపాఠి.