హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు నారాయణ ను టార్గెట్ చేసి పలు కేసులు నమోదు చేసి.. సోదాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నారాయణ కుమార్తెను అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. సీఐడీ అధికారులు పలు బందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. అయితే ఏ కేసులో నారాయణ కుమార్తె నివాసంలో అధికారులు సోదాలు చేపడుతున్నారనే విషయంలో స్పష్టత లేదు.
నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీతో పాటు, అమరావతి రాజధాని భూముల కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు పలు రికార్డలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే టె¯Œ ్త పేపర్ లీకేజీ వ్యవహారంలోనే నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.