కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల యుద్ధానికి అంతా సన్నద్ధమవుతున్నారు. ఈ రాత్రికి జరిగే బన్నీ ఉత్సవాలకు భారీ స్ధాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసలను రంగంలోకి దింపారు. ఉత్సవం జరిగే అన్ని ప్రాంతాల్లో 100కు పైగా నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతటా ఎల్.ఈ.డీ లైట్లను అమర్చారు. ప్రత్యేకంగా ఈసారి ఐదు డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్ధితిని సమీక్షించనున్నారు. ఇక ముందు జాగ్రత్తగా 150 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. పరిస్ధితి అదుపులో ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పడు అందరి చూపు దేవరగట్టు మీదే. ఎప్పుడు దసరా వచ్చినా అక్కడ పరిస్ధితులు పోలీసులను పరుగులు పెట్టిస్తాయి. అయితే ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.