AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ దేశానికే ఆదర్శం

అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై బడ్జెట్‌ ప్రసంగం
హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, దేశానికే ధాన్యాగారంగా మారుతోందని తమిళిసై అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు.??తెలంగాణ ప్రభుత్వ విజయాలు??సంక్షేమ పథకాలు??అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. దళితబంధు మిషన్‌ భగీరథ మిషన్‌ కాకతీయ రైతు బీమా వంటి ప్రతిష్టాత్మక పథకాల గురించి ప్రసంగంలో పొందుపర్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండనుంది. చాలాకాలం తర్వాత గవర్నర్‌ ప్రసంగం ఉండటంతో ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌ ప్రసంగం ఆమె మాటల్లోనే..

రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. రైతు బీమా అందిస్తున్నాం. మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధంచాం. రైతు పండిరచే ప్రతీ బియ్యం గింజను కొనుగోలు చేస్తాం. ఎన్నో సవాళ్లను ప్రభుత్వం అధిగమించింది. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. తెలంగాణ ప్రజల తలసారి ఆదాయం మూడిరతలు అయ్యింది. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు తీసుకొచ్చాం. రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టాం. తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను కి పెంచాం. అని తమిళిసై పేర్కొన్నారు.

?సివిల్‌ ఉద్యోగాల్లో మహిళలకు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నాం. లక్షలాది మంది ఆడపిల్లల కుటుంబాలకు షాదీ ముబారక్‌ ద్వారా లబ్ధి కల్పించాం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలకుపైగా ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేస్తున్నాం. ఉద్యోగాలను భర్తీ చేశాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టాం. ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు లభించింది. గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందిస్తున్నాం. కాంట్రాక్ట్‌ ఉద్యోగాల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

గత బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ తమిళిసై ప్రసంగం లేకపోవడంపై సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఈ సారి గవర్నర్‌ ప్రసంగం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10