సినీ లోకానికే ఆయన ఓ స్వాతిముత్యం. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఓ అద్భుతమైన నిఘంటువు.. ఆయన సినిమాలు ఎలాంటి ప్రేక్షకులనైనా రంజింపచేస్తాయి. కళానాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న జన్మించిన ఆయన బిఎస్సి వరకు చదువుకున్నారు. మద్రాస్ అదే ఇప్పటి చెన్నైలోని వాహిణి స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన విశ్వనాథ్ గారు ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. గురువారం రాత్రి మహా దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు.
కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల హ ృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. జీవనజ్యోతి, సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ ృతిలయలు, స్వయంక ృషి, స్వర్ణమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు ,శుభసంకల్పం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలను ఆయన మనకు అందించారు.
సినిమా కథ కథనాలే కాదు అందుకు తగిన సంగీతం.. సాహిత్యం మీద కూడా విశ్వనాథ్ గారి మార్క్ ఉంటుంది. అందుకే ఆయన సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. సంగీతంతో ప్రేక్షకుల హ ృదయాలను మెప్పించగలిగే అతి కొద్దిమంది దర్శకులలో కళాతపస్వి ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కమల్ హాసన్ తో ఆయన కాంబినేషన్ సినిమా అంటే అదో ప్రత్యేకమైన ఇంప్యాక్ట్ క్రియేట్ చేసాయి. చిరంజీవితో కూడా విశ్వనాథ్ గారు స్వయంక ృషి ఆపద్బాంధవుడు సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు.
ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసి గర్వపడేలా చేశారు కె విశ్వనాథ్. తెలుగు సినిమాకు ఆయన ఒక చిరునామా.. ఆయన అందించిన సినిమాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విశ్వనాథ్ గారి సినిమాల రూపంలో ఎప్పటికీ ప్రేక్షకుల హ ృదయాల్లో ఉంటారని చెప్పొచ్చు.
అయితే ఆయనకు చెందిన విశ్వ ఖ్యాతి గురించి .. ఆరు ప్రపంచ రికార్డుల గురించి తెలుగు ప్రజలకు ఎందరికి తెలుసు?.. ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ పేరును ఆరు ప్రపంచ రికార్డుల్లో నమోదు చేసినట్లు ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి కేవీ రమణారావు.. దక్షిణ భారత ప్రతినిధి కేవీ లలితారావులు గతంలో వెల్లడిరచారు.
కె.విశ్వనాథ్ జన్మదినం సందర్బంగా ఆయన నివాసానికి వెళ్లి ప్రపంచ రికార్డుల తాలూకు ధ్రువపత్రాలను లెజెండరీ దర్శకుడికి నేరుగా ఆ ఇరువురూ అందజేశారు. నోబెల్ వరల్డ్ రికార్డు- ఫిలిం వరల్డ్ రికార్డు- ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు- బయోగ్రఫీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు- భారత్ వరల్డ్ రికార్డు- టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో కె.విశ్వనాథ్ పేరు వినతికెక్కింది. సినీ పరిశ్రమకు విశ్వనాథ్ చేసిన సేవలను గుర్తించి ఈ రికార్డులకు ఎంపిక చేశారు.