- కంది శ్రీనివాసరెడ్డి విజయం ఖాయమంటున్న పబ్లిక్….
- కంది ఆదిలాబాద్ కోహినూర్ వజ్రం : మేధావి వర్గం
ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి అన్నివర్గాల జనం అండగా నిలుస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్ కు శ్రీరామరక్ష అని స్పష్టం చేస్తున్నారు. శక్తి, యుక్తి ఉన్న యువ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తేల్చిచెబుతున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన జోగు రామన్న డిపాజిట్ ను గల్లంతు చేసి, ఆదిలాబాద్ గడ్డపై కాషాయజెండా ఎగరేస్తామని ప్రతిన బూనుతున్నారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఊరూరా యువ నాయకుడు, బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మార్మోగుతోంది. ఏ నోట విన్నా కంది శ్రీనివాస్ రెడ్డి పేరే వినిపిస్తోంది. అద్భుతమైన సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి నిజంగానే ప్రజా నాయకుడంటూ జనమంతా కీర్తిస్తున్నారు. ఆదిలాబాద్ గడ్డ ఇన్నాళ్లూ ఎదురుచూసింది ఇలాంటి యువ నాయకుడి గురించే కదా అని జనం చర్చించుకుంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం జిల్లా కేంద్రమైనా ఇక్కడ పరిశ్రమలు లేవు. అదే విషయాన్ని కంది శ్రీనివాస్ రెడ్డి పదేపదే ప్రశ్నిస్తున్నారు . స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. ఆదిలాబాద్ లో పరిశ్రమలు ఎందుకు లేవు, ఫ్యాక్టరీలు లేకపోవడానికి కారణమెవరంటూ నిలదీస్తున్నారు. దోచుకోవడం.. దాచుకోవడమే ఎమ్మెల్యే జోగు రామన్న తీరు అంటూ కడిగి పారేస్తున్నారు. ఆదిలాబాద్ ను అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఊర్లోనూ ఏదో రకంగా సాయం చేస్తున్నారు. అంబులెన్స్ సేవలు మొదలుకుని క్రికెట్ కిట్ల పంపిణీ వరకు అన్నీ చేస్తూ అన్నివర్గాల జనానికి చేయూతను అందిస్తున్నారు. కష్టం ఉందంటూ జనం నోరు తెరిచి అడగక ముందే సాయాన్ని అందజేస్తూ తన గొప్పమనసును చాటుకుంటున్నారు. అందుకే ఆదిలాబాద్ ప్రజలంతా కంది శ్రీనివాస్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి యువ నాయకుడు ఎమ్మెల్యే అయితే ఆదిలాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయమంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని ఆదిలాబాద్ టౌన్ వరకు ప్రతి ఒక్కరూ కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. చివరకు జోగు రామన్నకు తోడుగా నిలిచిన నాయకులు సైతం ఇక అతన్ని భరించలేమంటూ బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. మచ్చలేని నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి వెంటే ఉంటామని తేల్చిచెబుతున్నారు. అందుకే బీజేపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ ఆదివాసీ నాయకుడు, బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కొడప సోనేరావు బీజేపీలో చేరడమే అందుకు నిదర్శనం. జోగు రామన్నకు ధీటైన నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డే అని సోనేరావు చెబుతున్నారు. ఎదిరించే వారు లేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన జోగు రామన్నను ఓడించే సత్తా కంది శ్రీనివాస్ రెడ్డికే ఉందని స్పష్టం చేస్తున్నారాయన. ఎవరెన్ని కుట్రలు చేసినా కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ లో విజయఢంకా మోగించడం ఖాయమంటున్నారు సోనేరావు.
ప్రజల కోసం ఎందాకైనా సిద్ధమంటున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి తపన, ఉక్కు సంకల్పం నిజమైన ప్రజానాయకులకే సాధ్యం. మేధావుల మాటల్లో చెప్పాలంటే కంది శ్రీనివాస్ రెడ్డి ఓ అరుదైన నాయకుడు. మేలిమి బంగారం. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే జనాలకు ఎంతో మేలు జరుగుతుందని మేధావివర్గం చెబుతోంది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అన్నివర్గాల జనం కోరుకుంటున్నది ఒక్కటే. కోహినూర్ వజ్రం లాంటి కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంపై కాషాయజెండా ఎగరేయాలి. అందుకే జనమంతా జై కంది శ్రీనివాస్ రెడ్డి అని నినదిస్తున్నారు. ప్రజా నాయకుడిని ప్రజలతో వేరు చేయడం ఎవరి వల్లా కాదని తేల్చిచెబుతున్నారు.