పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
కేంద్రం ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృషన్, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్ అనసూయ, లడఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలండ్ గవర్నర్‌గా గణేషన్, మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్, బీహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బి.డి.మిశ్రాను నియమించారు.
ఆదివారం పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను మార్చి పాతవారి స్థానంలో కొత్తవారిని నియమించింది. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్తవారిని నియమించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గవర్నర్ మార్పు అంశం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ఏదైనా రాజకీయం కోణం ఉందా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గవర్నర్లను మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది.