సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
మెదక్: ఏడుపాయలలో వనదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుఫున మంత్రి హరిశ్ రావు పట్టు వస్త్రాలు సమర్పించిచారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి వేద పండితుల మధ్య పూర్ణ కుంభంతో మంత్రి కి స్వాగతం పలికారు. వనదుర్గ సన్నిధిలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తోందని, తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నమన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. యాదాద్రి ని అద్భుతంగా తీర్చిదిద్దామని, అలాగే కొండగట్టు అభివృద్ధికి రూ 1000 కోట్లు కేటాయించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. వేద పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఏడుయలను పర్యాటక క్షేత్రంగా కృషిచేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.