AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎటు చూసినా శవాల దిబ్బలే..



గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు
భూప్రళయానికి టర్కీ, సిరియా దేశాల్లో అపారనష్టం

టర్కీ, సిరియా దేశాల్లో ఎటుచూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. భూప్రళయానికి భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. భూప్రళయానికి టర్కీ, సిరియా దేశాల్లో అపారనష్టం జరిగినట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో మృతదేహాల సంఖ్య 8వేలు దాటినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో స్థానికులు పాల్గొని ఎందరినో కాపాడుతున్నారు. ఏ రాయి తొలగించినా మృతదేహాలు కన్పిస్తున్నాయి. ఎవర్ని కదిలించిన అంతులేని విషాదమే. విపత్తు జరిగి రెండు రోజులు దాటడంతో శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు భారీగా బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం శిథిలాల నుంచి ప్రాణాలతో పిల్లలు బయటపడుతున్న అద్భుతాలు సైతం జరుగుతున్నాయి.

ఓ భవన శిథాలల కింద 10 ఏళ్ల లోపు వయసున్న అక్కా తమ్ముడు ఇరుక్కున్నారు. భవనం స్లాబ్‌ విరిగి వాళ్లపై పడిరది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్‌ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు. అయితే, అంతటి భయకరమైన పరిస్థితుల్లోనూ ఆ పదేళ్ల బాలిక మానవత్వాన్ని చాటుకున్నది. విరిగిన స్లాబ్‌ ఇంకేమాత్రం జారినా ఇద్దరం ప్రాణాలు కోల్పోతామని తెలిసి కూడా తమ్ముడి తలకు తన చేతిని అడ్డుపెట్టింది. చావు కౌగిట్లోనూ ఆ బాలిక పడుతున్న తపన అందరి హృదయాలను హత్తుకుంది.
శిథిలాల కింద చిక్కుకున్న నూర్‌ అనే చిన్నారి ఆచూకీ కోసం ఆమె తండ్రి గాలించాడు. రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. నూర్‌ జాడ కనిపెట్టిన రెస్క్యూ టీమ్‌.. ఆ చిన్నారికి ధైర్యం కల్పించారు. తన తండ్రి అక్కడే ఉన్నాడని.. ఆయనతో మాట్లాడాలని సూచించారు. నూర్‌ తండ్రి పక్కనే ఉండగా శిథిలాల నుంచి చిన్నారిని సురక్షితంగా బయటికి తీశారు. దీంతో నూర్‌ కుటుంబ సభ్యులతోపాటు సహాయక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అదే పట్టణంలో హరూన్‌ అనే మరో బాలుడిని శిథిలాల నుంచి సజీవంగా రెస్క్యూ సిబ్బంది బయటికి తీశారు. శిథిలాల కింద ప్రాణ భయంతో ఉన్న హరూన్‌ను కాపాడారు. ‘‘హరూన్‌ నువ్వు ఒక హీరోవి బయటికి రా’’ బాలుడికి ధైర్యాన్ని నూరిపోసి ప్రోత్సహించారు. చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ చిన్నారిని సురక్షితంగా బయటికి తీశారు. ఇదిలా ఉండగా మలాత్యాలో మిరాన్‌ అనే మూడేళ్ల బాలుడ్ని 22 గంటల అనంతరం శిథిలాల నుంచి క్షేమంగా బయటకు తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10