AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ లయకారుని దీవెనలు అందరిపై ఉండాలి

రాష్ట్ర, దేశ ప్రజలకు సీఎం కేసీఆర్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని సీఎం అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని సీఎం ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ANN TOP 10