AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ రెండు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సవాల్‌

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నేత రఘునందన్‌ రావు సవాల్‌ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలో దళితులందరికీ దళితబంధు యూనిట్లు, సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.7.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రెండు పనులు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ రెండు పనులు చేసి చూపించాలని సవాల్‌ చేశారు.

మంత్రి కేటీఆర్‌ ఈ రెండు పనులు చేసి చూపిస్తారా? అంటూ ప్రశ్నించారు. గత కొంతకాలంగా దుబ్బాకలో రఘునందన్‌ రావు వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ మధ్య తారాస్థాయిలో వార్‌ నడుస్తోంది. ఉపఎన్నికల సమయంలో రఘునందన్‌ రావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నిధులు అందటం లేదని రఘునందన్‌ రావు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కాబట్టే నిధులు ఇవ్వడం లేదంటూ హైకోర్టులో ఆయన పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

అయితే ఉపఎన్నికల సమయంలో రఘునందన్‌ రావు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఇటీవల అసెంబ్లీలో కేటీఆర్‌ చదివి వినిపించారు. ఉపఎన్నికలో గెలిచేందుకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. దీంతో అసెంబ్లీలో కేటీఆర్‌, రఘునందన్‌ మధ్య మాటల వార్‌ జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్‌కు రఘునందన్‌ రావు సవాల్‌ చేయడం చర్చనీయాంశమైంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10