‘లాఫింగ్ డిసీజ్’తో బాధపడుతున్న బాహుబలి ఫేమ్
‘బాహుబలి’ ఫేమ్ అనుష్క కూడా వింతవ్యాధి బారిన పడ్డట్టు వార్తలు వెలువడుతున్నాయి. అనుష్కకు వచ్చింది అలాంటిఇలాంటి జబ్బు కాదట. ఆమెను నవ్వించొద్దట. నవ్విస్తే మాత్రం సమస్యే. ఆమె నవ్విందంటే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వేస్తుందట. పెగా నవ్వాపుకోలేక నేలపై పొర్లాడుతుందట. కామెడీ సీన్ చూసినా, నటించినా నవ్వుతూ పొర్లాడుతుందట. అంత అందం, అణకువ ఉన్న ఆమెకు ఈ వ్యాధి ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ వాస్తవం అదే. ఆమెది ‘లాఫింగ్ డిసీజ్’ అట. కానీ ఈ కారణంగా సహచర నటులు, ఇతర సిబ్బంది టీ, స్నాక్స్‌కు బ్రేక్ తీసుకుంటారట.
నేడు నటీమణులలో చాలా మందికి ఎవరూ ఊహించని, ఏవేవో జబ్బులు వస్తున్నాయి. సమంత, శృతి హాసన్.. మైయోసైటీస్, పీసీఓఎస్ అనే జబ్బులతో బాధపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి కొత్త జబ్బులు వచ్చాయి. అయినప్పటికీ వారేమాత్రం ఢీలా పడిపోకుండా గుండె ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ‘బాహుబలి’ ఫేమ్ అనుష్కకు కూడా ఓ వింత జబ్బు బారిన పడ్డట్టు తెలుస్తోంది.