బాలీవుడ్ స్టార్ నటుడు షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన చత్తీస్‌గఢ్ న్యాయవాది ఫైజాన్‌ఖాన్‌ను ముంబై పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. తనకు రూ. 50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానని షారూఖ్‌ను ఫైజాన్ బెదిరించారు. రాయపూర్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఫైజాన్ ఇటీవల మాట్లాడుతూ ఈ నెల 14న తాను ముంబై వచ్చి బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. అయితే, గత రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తుండడంతో ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాస్తూ తన వాంగ్మూలాన్ని వర్చువల్‌గా తీసుకోవాలని కోరారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపుల నేపథ్యంలో షారూఖ్‌కు కూడా బెదిరింపులు రావడం కలకలం రేపింది. షారూఖ్ తనకు రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానంటూ గతవారం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫైజాన్‌ఖాన్ పేరుతో రిజస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముంబై పోలీసు బృందం రాయ్‌పూర్ వెళ్లి ఫైజాన్‌కు సమన్లు ఇచ్చింది. అయితే, ఆ బెదిరింపు కాల్‌కు, తనకు సంబంధం లేదని, ఈ నెల 2నే తాను ఫోన్ పోగొట్టుకున్నానని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.