AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షాకింగ్‌.. బేబీ బంప్‌తో సమంత.. ఫొటోలు వైరల్‌..!

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతోపాటు నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చెన్నై సుందరి.. అతి కొద్ది రోజుల్లోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్‌ నటుడు నాగచైతన్యను ప్రేమపెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడితో విడాకులు తీసుకుని సింగిల్‌గా ఉంటోంది.

ఈ క్రమంలో సమంతకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట షేక్‌ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో సామ్‌ బేబీ బంప్‌తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, అవి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ జనరేటెడ్‌) రూపొందించినవిగా తెలిసింది. ఏఐ సాయంతో సమంత బేబీ బంప్‌ ఫొటోలను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇవి కాస్తా వైరల్‌ కావడంతో నెటిజన్లు, అభిమానులు షాక్‌ అవుతున్నారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం మాతృత్వాన్ని అనుభవించాలని ఉందంటూ సామ్‌ అప్పట్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బేబీ బంప్‌ ఫొటోలు చూసిన వారంతా ఈ విషయాన్నే గుర్తు చేసుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10