కేరళలోని శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకుంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్‌కుమార్ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు.
ఈ పండుగలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రాంతి నాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది భక్తులు పాల్గొన్నారు.