పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ సీతారామచంద్రస్వామి ప్రసాదాలు అందజేసి ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పినపాక నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పులుసుబంత ప్రాజెక్టు, రేగుల గండి , సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ మారెళ్ళ పాడు గ్రావిటీకి పేరంటాల చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.