తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని..వారు కేసీఆర్ కుటుంబసభ్యులైన సరే… ఇంకెవరైనా సరే .. అరెస్టు అవుతారని మాజీ మంత్రి,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.మైలర్ దేవ్ పల్లి డివిజన్ కాటేదాన్ లో యువగలం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన కవితకు ఈడీ నోటీసులివ్వడంపై స్పందించారు.చట్టం ఎవరికీ చుట్టం కాదని, గతంలో కేసీఆర్ చెప్పినట్టు ఎవ్వరు తప్పుచేసినా చట్టం వదిలిపెట్టదని తెలిపారు.ఎలాంటి తప్పు చేయకపోతే కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధపు,బూటకపు ప్రమాణాలతో ప్రజల మోసం చేస్తున్నారని..అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు.