మాణిక్ రావ్ ఠాక్రే..
ఆదిలాబాద్: కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. కరీంనగర్‌కు వెళ్తూ మధ్యలో ఆదిలాబాద్‌లో కొద్దిసేపు ఆగిన ఆయన అమ్మన్యూస్ ప్రతినిధితో ఫేస్ టు ఫేస్ ముచ్చటించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వారు మాతో మమేకమవుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పేరిట సుమారు రూ. 5లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ అప్పు లెక్కలు ప్రజలకు వివరించాలన్నారు. లిక్కర్ స్కాంలో కవితపై ఉన్న ఆరోపణలను జవాబు ఇవ్వాల్సిందిపోయి బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని ఠాక్రే అన్నారు. దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్నారు. వారి అవినీతి విషయాన్ని తెలంగాణా ఆత్మగౌరవంతో ముడిపెట్టటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.