నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నెవర్ ఎండింగ్ టాపిక్ అయింది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి మరోసారి కనిపించడం, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం హాట్ ఇష్యూ అయింది. నరేష్- పవిత్ర లోకేష్ సహ జీవనం చేస్తూ పబ్లిక్ లో తిరుగుతున్నారు కానీ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పలు చర్చలు నడిచాయి. ఇంతలో రీసెంట్ గా ఓ పెళ్లి వీడియో వదిలి ఊహించని షాకిచ్చారు. అయితే చివరకు అది సినిమా ప్రమోషన్ కోసం అని తెలియడంతో అంతా షాకయ్యారు. ఏకంగా పవిత్ర లోకేష్ తో కలిసి తన తల్లి విజయ నిర్మల స్వగ్రామం అయిన ఏలూరు పాడుకి వెళ్లారు నరేష్. అంతేకాదు అక్కడి ఆలయంలో ఆమెతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.