నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్న యాంకర్ లాస్య పోస్ట్
టాలీవుడ్ యాంకర్ లాస్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మార్చి7న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ… లాస్య ఓ క్యూడ్ వీడియోను ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో లాస్య, మంజునాథ్‌తో పాటు వారి తొలి సంతానమైన దక్ష్ చేతులు ఉన్నాయి.ఒక్కొక్కరు తమ చేతులు ఓపెన్ చేస్తూ వస్తుంటే ‘ఇట్స్ ఏ బేబీ బాయ్’ అనే పదం కనిపిస్తోంది.మా జీవితంలో కొత్త ప్రేమను కలుసుకున్నాం అంటూ లాస్య పోస్ట్ చేసిన ఈ వీడియో.. నెటిజన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటుంది.