సిక్కింలో హిమపాతం కారణంగా ఆరుగురు పర్యాటకులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. సిక్కింలోని నాథులా సరిహద్దు ప్రాంతంలో భారీ హిమపాతం సంభవించిందని ఒక అధికారి తెలిపారు. భారీగా మంచు కురవడంతో దాదాపు 150 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. పర్యాటకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 22 మందిని రెస్క్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.