AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయండి

గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా 2022 ఏప్రిల్19న కేంద్రంతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 5 గ్రామాలలో డ్రోన్ సర్వేను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఆస్తులకు సంబంధించిన మ్యాపులను రూపొందించిందని, ప్రస్తుతం ఈ మ్యాపులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను రూపొందించి, హక్కుదారులకు పంపిణీ చేయవలసిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మిగిలిందన్నారు కిషన్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని 2022 జూలై 29న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖను రాశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో ఎటువంటి ముందడుగూ పడకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినట్లయితే ధరణి పోర్టల్ నందు ఎదురవుతున్న సమస్యల నుంచి తెలంగాణ ప్రజలు బయటపడొచ్చన్నారు కిషన్ రెడ్డి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10