AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు నేడే ఆఖరు

తెలంగాణ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణలకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు నేటితో ముగియనుంంది. ఇప్పటి వరక దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఏప్రిల్‌ 3 గడువు సమయం ముగిసేలోపు దరఖస్తు చేసుకోవల్సిందిగా బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు డాక్టర్‌ ఎంపీవీ ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం 0870-2571192 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయనన్నారు.

కాగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గ్రూప్‌ 1తోపాటు పలు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షలకు కొత్త తేదీలను కూడా కమిషన్‌ తాజాగా ప్రకటించింది. జూన్‌ 11వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. మళ్లీ పోటీపడే అభ్యర్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆయన కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10