AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా ?

ఏప్రిల్ 1న చంద్రబాబు అసత్యాలు, పర దూషణలతో అలౌకిక ఆనందం పొందారని.. పేర్ని నాని ఫైర్ అయ్యారు. 175కి 175 చోట్ల వైసీపీని ఓడిస్తానంటున్నారు.. అసలు 175 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు ఉంటుందా అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పెట్టగలరా అని ఛాలెంజ్ చేశారు. టీడీపీకి 38 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు దొరకని పరిస్థితి ఉందని.. వైసీపీని ఓడించడం సంగతి పక్కన పెట్టి.. ముందు ఆ 38 చోట్లా క్యాండెట్లను వెతుక్కోండని Perni Nani హితవు పలికారు.

‘175లో పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ఇస్తున్నారు.. బీజేపీలో టీడీపీ జెండా మోస్తున్న వారికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీని తాకట్టు పెట్టిన నారాయణ ,రామకృష్ణకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు.. రాహుల్ గాంధీకి ఎన్ని సీట్లు ఇస్తున్నావ్.. రాహుల్ గాంధీని పోటీ పెడుతున్నారా.. 72 ఏళ్లు వచ్చాయి… ఇంకా ఉత్తర కుమార ప్రగల్భాలెందుకు. పది మందిని కలుపుకుంటే కానీ.. పోటీ చేయడానికి సాహసం చేయలేని దుస్థితి మీది. పవన్, బాలకృష్ణతో తిరిగి మాపై సినిమా డైలాగ్‌లు వదులుతున్నారు’ అని పేర్ని నాని సెటైర్లు వేశారు.

‘వైనాట్ పులివెందుల అనే వారందరికీ ఇదే నా ఆహ్వానం. చంద్రబాబు, పవన్ పులివెందులలో పోటీ చేయండి. ఇద్దరూ విడివిడిగా పోటీ చేసినా.. ఒప్పందం చేసుకుని పోటీ చేసినా పర్వాలేదు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేయండి.. మీరో మేమో.. తేలిపోతుంది. 21 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే.. నాలుగు గెలిచారు. నాలుగు గెలిచి సంకలు గుద్దుకోవడం దేనికి. ఇక ఈ జన్మలో గెలుపు చూడలేరనే భావనతోనే ఈ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు తన ఏజెంట్లతో జగన్ మోహన్ రెడ్డిని నీచంగా తిట్టిస్తున్నారు’ అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10