చివరకు రక్తపు వాంతులతో
చెన్నైలో స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. చెన్నై ఆవడి సమీపంలోని నెమిలిచ్చేరిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసం ఉండే 25 ఏళ్ల ఆకాష్ జిమ్ టైనర్‌గా పని చేస్తున్నారు. బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ విపరీతంగా వాడాడు. దీంతో రెండు రోజుల క్రితం అతడికి రక్తపు వాంతులు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, రెండు కిడ్నీలు పూర్తిగా పాడయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స పోందుతూ మృతి చెందాడు. ఆకాష్ రాష్ట్ర స్థాయి పోటీలో గెలవడానికి కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన స్టామినా మరింత పెంచుకునే ప్రయత్నంలో, పిచ్చితనంతో పెద్ద మొత్తంలో స్టెరాయిడ్లను తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకున్నాడు. దీంతో విపరీత పరిణామాలు ఎదురై ప్రాణాలు విడిచాడు.
ఇటు హైదారాబాద్‌లో కూడా స్టెరాయిడ్స్ కలకలం
మహానగరంలో మత్తుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత నిఘా పెట్టినా సరే ఎక్కడో అక్కడ డ్రగ్ మాఫియా ఉనికి హడలెత్తిస్తోంది. మరోవైపు లేటెస్ట్‌గా మరో బేషరమ్ వ్యవహారం సంచలనం రేపింది. అదే కండల క్రేజ్‌లో స్టెరాయిడ్స్ దందా. జిమ్స్ టార్గెట్‌గా సాగుతోన్న స్టెరాయిడ్స్ రాకెట్‌కు చెక్ పెట్టారు రాచకొండ SOT పోలీసులు. నగరంలో స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు
ఆరోగ్యమే మహాభాగ్యం…తిండి తింటే కండ కలదు..ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు అంతా కండల క్రేజ్. సిక్స్‌ప్యాక్ మోజుతో యువత జిమ్‌లా బాటపడుతోంది. జిమ్‌లకి వెళ్లడం తప్పుకాదు…కానీ ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే మొదటికే మోసం. ఐతే ఇప్పుడు మ్యాటర్ ఇది కాదు…ఈ కండల షోకుతో యువత ఇప్పుడు ఏకంగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. బాడీని బంతిలా తిప్పేయాలనే మోజులో హైదరాబాద్ సిటీలోని అనేక జిమ్‌లో యువత స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది.