ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు, అదనపు మెట్రో సర్వీసులు
నేడు మధ్యాహ్నం హైదరాబాద్, రాజస్థాన్ మధ్య మ్యాచ్
హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి షురూ అయింది. ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. మ్యాచ్ సందర్భంగా అదనపు మెట్రో సర్వీసులను నడపనున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి మెట్రో అదనపు సర్వీసులను నడపనుంది. ప్రతి రెండు, మూడు నిమిషాలకు ఒక మెట్రో సర్వీసును అందుబాటులో ఉంచనుంది.
ఇక టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ శివార్ల నుంచి ఉప్పల్ వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీంతో సాయంత్రం వరకు ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.