AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారంలో ఈ ఒక్కరోజు వందేభారత్ రైలు నడవదు

మరో 8 రోజుల్లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఐతే ఈ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు మాత్రం నడవదు. ఆ వివరాలను తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలకు రెండో వందే భారత్ రైలు వచ్చేస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ఏప్రిల్ 8న ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. ఏప్రిల్ 8న ప్రారంభోత్సవం నేపథ్యంలో సాధారణ ప్రయాణికులను రైలు లోనికి అనుమతించరు. ఏప్రిల్ 9 నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 9న తిరుపతి- సికింద్రాబాద్ మార్గంలో మాత్రమే నడుస్తుంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు షెడ్యూల్ ఇప్పటికే ఖరాదైంది.

ఈ వందే భారత్ రైలు వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది. మంగళవారం ఒక్క రోజు మాత్రం నడవదు. టికెట్ ధరలపై స్పష్టత వచ్చిన తర్వాత.. ఏప్రిల్ 8 నుంచి రైలు టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో మధ్యాహ్నం 03:15కి బయలుదేరి.. రాత్రి 11:45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలుకు నాలుగు స్టాప్స్ మాత్రమే ఉంటాయి. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే ఆగుతుంది. గుంటూరులో 5 నిమిషాలు, మిగతా స్టేషన్‌లలో ఒక నిమిషం పాటు మాత్రమే నిలుపుతారు. మొత్తం 660.77 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10