కూతురు మరణ వార్త విన్న తల్లి వెంటనే..
రంగారెడ్డి: జిల్లాలోని షాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హైతాబాద్ గ్రామంలో తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు భర్తతో గొడవ పడడంతో అల్లుడు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భర్త ఆత్మహత్యయత్నానికి కారణం తనేనని భార్య ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తట్టుకోలేక తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.