AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లక్షద్వీప్‌ ఎంపీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

ఎన్సీపీ నేత, లక్షద్వీప్‌ (Lakshadweep) ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై (Mohammed Faizal) అనర్హత వేటును లోక్‌సభ రద్దుచేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ (Lok Sabha membership) లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. హైకోర్టు చెప్పటినప్పటికీ తనను సభలోకి అనుమతించడం లేదంటూ ఫైజల్‌ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సమ్మతించిన నేపథ్యంలో అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్‌ రద్దుచేయడం గమనార్హం.

ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11న కవరట్టి సెషన్స్‌ కోర్టు మహమ్మద్‌ ఫైజల్‌కు పదేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అదే నెల 13న లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. అనంతరం ఆయన తన జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కేరళ హైకోర్టులో (Kerala High Court) పిటిషన్‌ వేశారు. దానిని విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ ఆయనపై అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్‌ ఎత్తివేయలేదు. తాను పార్లమెంటుకు వచ్చినప్పటికీ.. భద్రతా సిబ్బంది సభలోపలికి అనుమతించడం లేదంటూ ఇటీవల ఆయన సుప్రీకోర్టును ఆశ్రయించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10