ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు మరోసారి విచారణకు రావాలని ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. దీనితో కవిత ప్రతినిధి సోమా భరత్ హుటాహుటీన ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారించారు.
ఈనెల 11న మొదటిసారి విచారణ సమయంలో కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ తరువాత 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీకి స్టీల్ కవర్ లో అప్పగించారు. ఈ క్రమంలో ఆ ఫోన్లను తెరిచేందుకు సాక్షిగా కవితను కానీ ఆమె ప్రతినిధిని కానీ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత ప్రతినిధి సోమా భరత్ ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లగా..ఆయన బయటకు వస్తే పూర్తి విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.