AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్ చరణ్‌పై చిరంజీవి ప్రేమ వర్షం..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తనయుడిగా మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి చిరంజీవిని మించి గ్లోబల్ ఇమేజ్ (Global Star) సాధించాడు. నటుడిగా ఒక్కో మెట్టు ఎదిగి ఇప్పుడు హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ తన కోసం ఎదురుచూసే స్థాయికి చేరుకున్నాడు. రాజమౌళి రూపొందించిన RRR చిత్రంలో తన ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించిన చరణ్.. భారతీయులతో పాటు విదేశీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఇది ఏ తండ్రికైనా గర్వించే క్షణమే. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా మినహాయింపేం కాదు. అందుకే ఈ రోజు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా చిరు స్పెషల్ మెసేజ్‌తో పోస్ట్ చేసిన పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా.. అతడిపై చెంపపై తాను ప్రేమగా ముద్దు పెట్టుకున్న ఫొటోను మెగాస్టార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు ‘ప్రౌడ్ ఆఫ్ యు నాన్న.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఈ పిక్ చూస్తుంటే.. చరణ్ సాధించిన విజయాలకు తండ్రిగా మెగాస్టార్ ఎంతగా పొంగిపోతున్నాడో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. తండ్రీ కొడుకుల ప్రేమానురాగాలు చూసి నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే, తనయుడు రామ్ చరణ్ పట్ల చిరంజీవి గర్వించే క్షణాల వెనుక ఆయన ఎన్నాళ్లుగానో అనుభవించిన ఆవేదన ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తు్న్నారు. 2007లో వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి ఆవేశంగా ప్రసంగించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఆ వేడుకల్లో చిరంజీవికి లెజెండ్రీ అవార్డ్ ఇవ్వడం పట్ల కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఆవేశంగా మాట్లాడిన చిరు.. ‘గోవా, న్యూఢిల్లీ, ముంబై’ ఫిలిం ఫెస్టివల్స్‌లో తెలుగు వాళ్లకు గుర్తింపు లేదని బాధపడ్డారు. తాను ఒకసారి గోవా ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినపుడు మహానటుడు రామారావు గారి ఫొటో కూడా లేదని వాపోయారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10